• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెంగళూరు వరదలపై కేటీఆర్ స్పందన

    దేశ ఐటీ రాజధాని బెంగళూరులో వరదలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పట్టణీకరణను అప్‌గ్రేడ్ చేయడంలో తగినంత మూలధనం ఇన్‌వెస్ట్ చేయనందున మౌలిక సదుపాయాలు కుప్పకూలిపోతాయని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మన నగరాలు రాష్ట్రాలకు ఆర్థిక ఇంజన్ల వంటివన్నారు. అవి దేశ వృద్ధికి తోడ్పాటునిస్తాయని వెల్లడించారు. పట్టణ ప్రణాళిక నిర్వహణకు ధైర్యవంతమైన సంస్కరణలు అవసరమని మంత్రి చెప్పారు. తాగునీరు, రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించడం పెద్ద కష్టమైన పని కాదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కేటీఆర్ ట్యాగ్ చేశారు. To all … Read more

    యూపీలో ఇసుక మాఫీయా ఆరాచకాలు

    ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. సాయియాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు రహదార్లపై బారీకెడ్లు ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లకు పోలీసులు దారి మూసేశారు. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా బారీకెడ్లను ధ్వంసం చేసుకుంటూ ట్రాక్టర్లతో ముందుకు సాగాయి. ఒకేసారి 12 ట్రాక్టర్లు వేగంగా ముందుకు దూసుకు రావడంతో పోలీసులు నిస్సాహాయంగా ఉండిపోయారు. వీడియో కోసం watch on పై క్లిక్ చేయండి. #WATCH | Uttar Pradesh: At least 12 sand-laden tractors, … Read more

    వర్షాలతో ఐటీ రాజధాని బెంగళూరు అస్తవ్యస్తం

    కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు చేరి ఐటీ కారిడార్ సహా అనేక లోతట్టు ప్రాంతాలు చెరవులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడి జనాలు రాకపోకలు సాగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. గంటల కొద్ది ట్రాఫిక్ ఏర్పడి అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈనెల 9 వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వానలు బీదర్, కళాబురాగి, విజయపుర, గాడగ్, ధార్వాడ్, హవేరి వంటి ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

    పైలట్ల సమ్మె.. దిల్లీలో ప్రయాణికుల ఆందోళన

    జర్మనీ దేశ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా పైలట్ల సమ్మె సెగ.. ఇండియాను తాకింది. సమ్మె ప్రభావంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ దేశానికి వెళ్లాల్సిన ప్రయాణికులు దిల్లీలోనే ఆగిపోయారు. ఇందులో ఎక్కువగా విద్యార్థులే ఉండటం గమనార్హం. తమ సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని ఎయిర్ పోర్టులో ఆందోళన చేశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. తమ జీతాల పెంపును లుఫ్తాన్సా తిరస్కరించడంతో పైలట్లు సమ్మెకు దిగారు. Students' Strike at IGI Airport Delhi, as Lufthansa cancels two flights to … Read more

    సెప్టెంబర్‌లో మారే కీలక ఆర్థికాంశాలు

    RBI నిబంధనల మేరకు సెప్టెంబర్‌లో ఆర్థికపర అంశాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటో చూద్దాం. **డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు:** సెప్టెంబర్‌ నుంచి అనేక బ్యాంకులు కార్డులపై వార్షిక చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. కార్డ్‌ ఇన్‌పుట్‌లలో ఉపయోగించే చిప్‌ల ధర భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. **ఐటీ రిటర్న్స్ గడువు:** ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి వెరిఫికేషన్‌కు ఈ నెల 7తో గడువు ముగుస్తుంది. రిటర్న్‌లు సబ్మిట్‌ చేసిన 30 రోజుల్లోగా ధ్రువీకరణ చేయాలి. **టోకనైజేషన్:** అక్టోబర్‌ 1 … Read more

    సెక్యూరిటీ గార్డుపై దాష్టీకం, అరెస్టు

    హరియాణాలోని గురుగ్రాంలో సెక్యూరిటీ గార్డుపై ఓ వ్యక్తి దాష్టీకం ప్రదర్శించాడు. నార్త్‌ అపార్ట్‌మెంట్స్‌ సమీపంలో నివాసముండే ఓ వ్యక్తి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది స్పందించి 2-3 నిమిషాల్లోనే బయటకు తీసుకొచ్చారు. కానీ ఆయన ఆగ్రహంతో ఊగిపోయి ఇద్దరు గార్డులపై దాడి చేశాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వరుణ్‌ నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.[ వీడియో](url) #WATCH | Haryana: A resident of The Close North Apartments in Gurugram thrashed security guards … Read more

    పినాక రాకెట్లను పరీక్షించిన DRDO

    భారత రక్షణ రంగ సంస్థ DRDO అభివృద్ధి చేసిన పినాక రాకెట్లను కొంతకాలంగా పరీక్షిస్తోంది. బాలాసోర్‌, పోక్రాన్‌లలో కొన్ని వారాలుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతికతో రూపొందిన ఈ రాకెట్లు భారత సైన్యానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ట్రయల్స్‌కు సంబంధించిన [వీడియో](url)ను రక్షణ రంగ అధికారులు మీడియాతో పంచుకున్నారు. DRDO-developed Enhanced Range Pinaka rockets' user trials conducted at Balasore&Pokhran in past few weeks. In success for Make in India in defence,manufacturers incl Munitions India … Read more

    ఆ నలుగురు వృద్ధుల పోరాటం వల్లే కూలిన ట్విన్‌ టవర్స్‌

    దాదాపు దశాబ్ద కాలం పాటు నలుగురు సీనియర్‌ సిటిజన్ల పోరాట ఫలితంగానే ఇవాళ నోయిడాలోని సూపర్‌టెక్‌ ట్విన్‌ టవర్స్‌ నేలమట్టమయ్యాయి. విరాళాలు పోగేసుకుని మరీ ఈ నలుగురు వృద్ధులు కోర్టుల చుట్టూ తిరిగారు. 2009లో సూపర్‌టెక్‌ ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. నిబంధలన్నీ గాలికొదిలేసి నిర్మాణం చేపట్టారు. దీనిపై యూబీఎస్‌ టియోటియా (80), ఎస్‌కే శర్మ(74), రవి బజాజ్‌(65), ఎంకే జైన్‌(59) కలిసి లీగల్ కమిటీగా ఏర్పడి కోర్టుకెళ్లారు. 2014లోనే అలహాబాద్‌ కోర్టు టవర్ల కూల్చివేతకు ఆదేశించింది. అయితే ఫిన్‌టెక్‌ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో … Read more

    సుప్రీంకోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం

    సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజైన తన విచారణను ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చారు. సుమారు 20 కేసులు విచారించనున్నారు. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు చరిత్రలోనే విప్లవత్మాకమైనదని న్యాయనిపుణులు చెబుతున్నారు.సుప్రీంకోర్టు విచారణను మీరు కూడా లైవ్‌లో చూడండి.

    అమితాబ్‌కు మళ్లీ కరోనా పాజిటివ్

    ప్రముఖ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్(79) మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని, తనను కలిసిన వారు, తన చుట్టు ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 14 షూటింగ్‌లో భాగంగా బిజీగా ఉన్నారు. T 4388 – I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around … Read more