• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

    తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్నకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. జడ్జిలను దూషించారన్న అభియోగాలపై ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం పలు ఆరోగ్య పరీక్షల కోసం బుద్దా వెంకన్న హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ వెళ్లిన సీఐడీ అధికారులు.. నేరుగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్లు చెప్పారు.

    కాళేశ్వరం ప్రశ్నార్థకమైంది: కిషన్‌ రెడ్డి

    TG: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఫ్లాప్‌ అయ్యిందని రాష్ట్ర భాజపా చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డిలోని రాజారెడ్డి గార్డెన్‌లో ఆయన మాట్లాడారు. రూ.1.20 లక్షలు పెట్టి కేసీఆర్‌ కాళేశ్వరం కడితే అది కుంగిపోతోందని విమర్శించారు. కూలిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. చివరకూ కాళేశ్వరమే ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు. ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిన సీఎంను కామారెడ్డి ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.

    అబద్ధాలు నమ్మి.. ఓటు వేయొద్దు: KCR

    ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మి.. ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతుబంధును కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తెస్తుందన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా వెనకబడి ఉన్న ఎస్సీలు బాగుపడాలనే దళితబంధు తీసుకొచ్చానని’. కేసీఆర్‌ తెలిపారు.

    రేవంత్‌ తెలంగాణ వ్యతిరేకి: హరీష్‌రావు

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ వ్యతిరేకని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ప్రజలు తెలంగాణకు మద్ధతు ఇస్తే రేవంత్ తుపాకీ పట్టుకుని బయటికొచ్చి బెదిరించాడన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా రేవంత్‌ రెడ్డి పదవిని పట్టుకుని పాకులాడిండని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఇప్పుడు ఒక్కటవుతున్నారన్నారు. ఇలాంటి తెలంగాణ ద్రోహులకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.

    ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జి కానున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆయన్ను డిశ్చార్జి చేయనున్నారు. ఏఐజీ నుంచి ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లనున్నారు. చంద్రబాబు కంటి సమస్యకు వైద్యులు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంది. చంద్రబాబు వైద్య పరీక్షల కోసం నిన్న ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే..

    TS: ఎన్నికల్లో పోటీకి షర్మిల దూరం

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్ధేశం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడటం సరికాదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని షర్మిల పేర్కొన్నారు.

    TS: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

    చంద్రబాబు కేసులో కీలక మలుపు

    AP: చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మొత్తం 12 మంది ఐఏఎస్‌లను విచారించాలంటూ న్యాయవాది ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. తెదేపా హయాంలో సిమెన్స్‌ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ఫిర్యాదులో కోరారు. కాంట్రాక్ట్‌, చెక్‌ పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిల్లోని అధికారులను కూడా విచారించాలని సీఐడీకి ఫిర్యాదులో సూచించారు.

    కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్

    TG: కాంగ్రెస్ పార్టీది దుర్మార్గ‌మైన సంస్కృతి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. క‌త్తుల‌తో దాడులు చేసి భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. నిర్మ‌ల్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ‘పదేళ్ల భారాస పాలనలో క‌ర్ఫ్యూ లేదు. మ‌త‌క‌ల్లోలం లేదు. కానీ కాంగ్రెస్ నేతలు క‌త్తులు ప‌ట్టి దాడులు చేస్తున్నారు. మొన్న దుబ్బాక అభ్య‌ర్థిని కత్తితో పొడిచారు. దేవుడి ద‌య వ‌ల్ల ప్రాణ‌పాయం త‌ప్పింది. కాంగ్రెస్ పార్టీది ఇంత దుర్మార్గ‌మైన సంస్కృతి’ అని మండిపడ్డారు.

    ప్రజల హక్కుల కోసమే BRS పుట్టింది: KCR

    ప్రజల హక్కుల కోసమే బీఆర్‌ఎస్ పెట్టిందని సీఎం కేటీఆర్ అన్నారు. 15 ఏళ్ల పోరాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. నిర్మల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ‘రైతులకు మేలు చేసే ఉద్దేశంతో రైతుబంధు తీసుకొచ్చాం. దాన్ని కాంగ్రెస్ దుబారా ఖర్చు అని అంటుంది. ఇప్పటికే చాలా మంది రైతుల రుణమాఫీ చేశాం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో మరి కొందరికి పూర్తి చేయలేక పోయాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు. ధరణి తస్తుంది. అప్పుడు అవి రెండూ కూడా ఆగిపోతాయి’ అని … Read more