• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పండుగల వేళ సైబర్ మోసాలతో జాగ్రత్త!

    పండుగల సమయంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ క్రైం సోషల్ మీడియాలో ఓ[ వీడియో](url)ను పోస్ట్ చేసింది. వీడియోలో ఏదైనా షాపుల వద్ద బట్టలు తదితర వస్తువులు కొన్న తర్వాత ఎటువంటి లాటరీ కూపన్‌లలో మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని కోరారు. ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ ఇవ్వడం ద్వారా సైబర్ నేరగాళ్ల చేతికి మీ సమాచారం వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే గతంలో అనేక మంది లాటరీ బారిన పడి మోసపోయినట్లు వెల్లడించారు. సైబర్ మోసాల … Read more

    హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

    హైదరాబాద్‌లో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రెండు గంటల్లో ఏకంగా 10 సెం.మీల వాన కురిసింది. మరో రెండు గంటలపాటు ఎవరూ బయటికి రావొద్దని హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. PVR, డీ మార్ట్‌, యశోద హాస్పిటల్‌, నల్గొండ క్రాస్‌ రోడ్స్‌, మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్‌, చాదర్‌ఘాట్ రోటరీ వద్ద వరదనీటి కారణంగా ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోందని తెలిపారు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లకుంటే తీవ్ర ట్రాఫిక్‌ జాంలో చిక్కుకుంటారని హెచ్చరిస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై … Read more

    ఒకే స్టైల్‌లో ప్రభాస్-కృష్ణంరాజు

    రెబెల్‌స్టార్ కృష్ణంరాజు, డార్లింగ్ ప్రభాస్‌ల ఎడిటింగ్ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇద్దరి మేనరిజాలు పోలుస్తూ ఓ నెటిజన్ ఎడిట్ వీడియో రూపొందించాడు. ఈ వీడియోలో ఇద్దరూ వారి వారి సినిమాల్లో ఒకే రకంగా నవరసాలు పండిస్తూ నటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల రెబెల్‌స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas)

    బాలకృష్ణపై మంత్రి రమేష్ సంచలన వ్యాఖ్యలు

    టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది ఎవరని ప్రశ్నించారు. NTRను కూలదొసినపుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. టీడీపీ పార్టీని లాక్కొని మీ బావ సీఎం కూర్చిలో కూర్చొలేదా అంటూ ఎద్దేవా చేశారు. ముందు బాబుకు బుద్దిచెప్పాలని రమేష్ హితవు పలికారు. ఎన్టీఆర్ చివరి కోరికను నెరవేర్చలేదని, ఈ జాతికి NTRను దూరం చేసింది ఎవరని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉండేందుకు ఓ జిల్లాకు పేరు పెట్టామని జోగి … Read more

    లిఫ్ట్‌ వచ్చిందనుకుని వెళ్లి మహిళ మృతి

    ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విషాదకర ఘటన వెలుగుచూసింది. లిఫ్ట్‌ వచ్చిందనుకుని అందులోకి వెళ్లిన మహిళ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. బంధువులను పరామర్శించేందుకు వెళ్లిన మహిళ తానే ప్రాణాలు కోల్పోయింది. రెండో ఫ్లోర్లో లిఫ్ట్‌ బటన్ నొక్కిన మహిళ..లిఫ్ట్‌ రాకముందే ఫోన్ మాట్లాడుకుంటూ అందులోకి వెళ్లింది. ఒక్కసారిగా గుంతలో పడి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు వైరా మండలం గొల్లన్నపాడుకు చెందిన ప్రమీలగా గుర్తించారు.

    త్వరలో 3 నిర్మాణాలు KCRచే ప్రారంభం

    తెలంగాణ కొత్త సచివాలయ భవనం పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో హైదరాబాద్‌లో 3 మెగా ప్రాజెక్టులను కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సచివాలయం పనులు ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తి కాగా, డోమ్, చుట్టూ ప్రహారి గోడ వంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ మూడు నిర్మాణాల్లో.. 1. అంబేద్కర్ పేరుతో తెలంగాణ సెక్రటేరియట్ 2. తెలంగాణ అమరవీరుల స్మారకం 3. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం The New Secretariat building of … Read more

    మీ ఫ్యామిలీ ఎదురుచూస్తుంది: పోలీసులు

    రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ చిన్న [వీడియోను](url) రిలీజ్ చేశారు. వీడియోలో మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోందని చెబుతున్నట్లుగా ఉంది. వాహనం పరిమిత స్పీడుతో నడపాలని, మీ ఇంటి దగ్గర మీ పాప మీ కోసం వెయిట్ చేస్తుందని పేర్కొన్నారు. వేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు మద్యం సేవించి కూడా వాహనం నడపొద్దని వాహనదారులకు సూచించారు. ఈ నిబంధలు తప్పకుండా పాటించి కుంటుంబానికి అండగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు … Read more

    TSRTC యూట్యూబ్ ఛానల్‌పై సజ్జనార్ ట్వీట్

    TSRTC యూట్యూబ్ [ఛానల్‌](url)ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని ఈ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను కోరారు. దీంతో ఆర్టీసీ తాజా సంఘటనలు, తిరుమల రిజర్వేషన్ టిక్కెట్ల ఆఫర్లు సహా పలు విషయాలు తెలుసుకోవచ్చని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వినూత్నంగా పోస్టులు చేస్తూ ఆర్టీసీ మరింత ఎక్కువ మందికి చేరువయ్యే ప్రయత్నం సజ్జనార్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని వినూత్న కార్యక్రమాల ద్వారా లాభాల బాటలోకి సజ్జనార్ తీసుకొచ్చారని పలువురు కొనియాడుతున్నారు. Subscribe to our @YouTube Channel … Read more

    సూర్యపేట ఎస్పీ తీరు సిగ్గు చేటు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

    సూర్యపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ వ్యవహార శైలీపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ నాయకులను పొగడటం ఏంటని విమర్శించారు. ‘సూర్యపేట ఎస్పీ తీరు సిగ్గు చేటు. సీఎం కాళ్లు మొక్కిన కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యాడు. మంత్రిని ప్రశంసించిన ఎస్పీ ఎమౌతాడో’ అని ఎద్దేవా చేశారు. ఈరోజు సూర్యపేటలో జరిగిన తెలంగాణ సమైక్యత దినోత్సవంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. జగదీశ్ రెడ్డిని బాహుబలి అంటూ ఎస్పీ ప్రశంసించారు. జయహో.. జగదీశ్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.

    తెలంగాణలో మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు

    తెలంగాణలో మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు రెండు స్టింగ్ ఆపరేషన్ వీడియోలు బయటపెట్టిన బీజేపీ వీడియోలో హైదరాబాద్ లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్లై పేరు ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై ఇంట్లో సోదాలు చేసిన ఈడీ