• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్.. డ్యాన్స్ అదరగొట్టేశారు: కేటీఆర్

    తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కొందరు చిన్నారులు కాలా చాస్మా సాంగ్‌కు డ్యాన్స్ చేయడం చూడొచ్చు. ఆ వీడియోను షేర్ చేసిన కేటీఆర్.. ‘ఈ వీడియో చూస్తే మీ అందరి ముఖాల్లో చిరునవ్వు రావడం ఖాయం. చిన్నారులు డ్యాన్స్ అదరగొట్టేశారు’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. … Read more

    రంగారెడ్డిలో సీఎం కేసీఆర్ లైవ్

    తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా నూతన కలక్టరేట్‌ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్నారు. పైన ఉన్న వీడియోలో మీరు ఆయన ప్రసంగిస్తున్న లైవ్ వీడియోను చూడొచ్చు.

    ట్యాంక్‌బండ్ ‘సండే ఫన్‌డే’ వీడియో

    హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం ‘సండే ఫన్‌డే’ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరవని వారి కోసం తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ వీడియోను షేర్ చేసింది. సండే ఫన్‌డే మిస్ అయిన వారు ఈ వీడియో చూసుకోవచ్చని తెలిపింది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. For those of you who couldn't make it to yesterday's #SundayFunday at TankBund, here's a glimpse of the fun & excitement … Read more

    మంత్రి పదవి కోసం లక్ష్మీ పార్వతి వడ్డాణం అడిగారు: ఎర్రబెల్లి

    తెరాస మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఒకప్పు తెదేపా నేత. ఎన్టీఆర్‌కు చాలా సన్నిహితుడిగా ఉండేవారు. అయితే గతంలో తనకు ఎన్టీఆర్‌ మంత్రి పదవి ఇస్తానని చెప్పినపుడు లక్ష్మీపార్వతి వడ్డాణం అడిగారని చెప్పారు. ‘ మా పెళ్లికి వ్యతిరేకించినా నీకు మంత్రి పదవి ఇప్పిస్తున్నాను. నాకు వడ్డాణం కొనివ్వాలి’ అని లక్ష్మీ పార్వతి చెప్పారని ఇటీవల ఓపెన్‌ హార్ట్‌ విత్‌ RK కార్యక్రమంలో ఎర్రబెల్లి పంచుకున్నారు.

    ‘అమిత్ షా గారు ఇదేనా మీరు తెచ్చే జంగల్ రాజ్యం ?’

    తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆందోళన చేస్తున్న రైతులపై నుంచి కార్లను తీసుకెళ్తున్న వీడియోను షేర్ చేశారు. ‘ఇదేనా రైతు అనుకూల మోడీ ప్రభుత్వం ? ఇలాంటి జంగల్ రాజ్యాన్ని మీరు తెలంగాణకు తీసుకొస్తారా అమిత్ షా గారు’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. The Farmer friendly Modi Govt Is this the Jungle Raj that you to bring … Read more

    అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

    కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హీరో జూనియర్ ఎన్టీఆర్ బేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ వ్యూహంలో భాగంగానే షాను కలిసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ సేవలు దేశవ్యాప్తంగా ఉపయోగించుకునేందుకే కలిసి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ భేటీకి రాజకీయ కారణాలే కానీ, ఎన్టీఆర్ ను అభినందించేదుకు కాదన్నారు. ఇక అమిత్ షా ఉపయోగం లేకుండా ఓ ఒక్కరిని కలవరని వెల్లడించారు.

    బండి సంజయ్ చెప్పులు ఇవ్వడంపై KTR తీవ్ర వ్యాఖ్య

    కేంద్ర హోమంత్రి అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించడంపై మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ చెప్పులు మోసే నాయకులను తెలంగాణ గమనిస్తుందని వ్యాఖ్యనించారు. మరోవైపు గుజరాత్ నేతల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని TRS నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మునుగోడు పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని అమిత్ షా సందర్శించారు. ఆక్రమంలో గుడి బయట షాకు బండి సంజయ్ చెప్పులు అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    రేపిస్టులు మరణించే వరకు జైల్లోనే ఉండాలి: కేటీఆర్

    జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో కూడా బెయిల్ మంజూరు చేశారన్న దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రేపిస్టులు అరెస్టైన 45 రోజుల తర్వాత తెలంగాణ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. జువెనైల్ యాక్ట్, IPC & CrPCలో లొసుగుల కారణంగా రేపిస్టులు బెయిల్‌పై వచ్చారన్నారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రేపిస్టులకు బెయిల్ రాకుండా మరణించే వరకు జైల్లోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల గుజరాత్లో 11 మంది రేపిస్టుల విడుదలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ … Read more

    ఆకట్టుకుంటున్న కరీంనగర్‌ కేబుల్ బ్రిడ్జ్

    హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ మాదిరిగానే కరీంనగర్‌లోని మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు. సుమారు రూ.183 కోట్ల అంచనా వ్యయంతో మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పథకంలో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ 500 మీటర్ల పొడువు ఉండగా.. మరో మూడు నెలల్లో ఈ బ్రిడ్జ్‌ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఆకట్టుకుంటుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. The newly constructed cable bridge in Karimnagar … Read more

    వికారాబాద్ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన

    సీఎం కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.ప్రస్తుతం బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.