• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్కసారి జనసేనవైపు చూడండి: పవన్ కల్యాణ్

    AP: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి అంటూ ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘నేను ఎక్కడికి పారిపోను, ఓడిపోయినా నిలబడే ఉన్నాం. నా కడశ్వాస వరకు నా కుటుంబం కన్నా మీరెక్కువ, ప్రజలెక్కువ, సమాజం ఎక్కువ. ఈ దేశం మీద ఒట్టేసి చెబుతున్నా, రాజకీయాలను వదిలేదే లేదు. నిలబడే ఉంటాం. మీరు పదవి ఇస్తే పదవితో సేవ చేస్తాం. ఇవ్వకపోతే.. పదవి లేకున్నా సేవచేస్తాం’ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి – … Read more

    బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. జనగామ జిల్లా దేవరుప్పలలో తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. దేవరుప్పల బహిరంగ సభలో మాట్లాడుతూ బండి సంజయ్‌ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో కేంద్రంలో ఏం ఉద్యోగాలు ఇచ్చారంటూ తెరాస కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి దాడులకు దారితీసింది. పలువురికి గాయాలు కాగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

    ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: KCR

    తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పించారు. కేసీఆర్ లైవ్‌ను పై వీడియోలో చూడవచ్చు.

    గన్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు

    ఫ్రీడమ్ ర్యాలీలో గన్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్‌తో కాల్చడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పోలీసులకు చెందిన వెపన్‌తో మంత్రి గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి ఎలా కాల్పులు జరుపుతారంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమేంటని మండిపడుతున్నారు. [వీడియో](url) Trs minister open fire during tiranga rally,police behaving like audience and applauding.will @TelanganaDGP take any action or rules are only for common people.#SrinivasGoud pic.twitter.com/Id5yGyDy3b — Raghav … Read more

    అన్నా- చెల్లెళ్ల బంధాన్ని గుర్తుచేస్తూ TSRTC పోస్ట్

    రాఖీ పండుగ పురస్కరించుకుని అన్నా- చెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తూ టీఎస్ఆర్టీసీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. “అన్నా చెల్లెళ్ల అనుబంధానికి వారధిగా #TSRTCLogistics ఉండబోతుంది. రాఖీలను పంపడం మీవంతు – మీ సోదరులకు సురక్షితంగా చేర్చడం మావంతు” అంటూ ట్వీట్ చేసింది. ఏదైనా కారణం చేత తమ సోదరులకు రాఖీ కట్టడం వీలుకాకపోతే.. తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్సీస్‌ల ద్వారా ఆడపడుచులు తక్కువ ధరలోనే రాఖీలు పంపచవచ్చని వెల్లడించింది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి వారధిగా #TSRTCLogistics ఉండబోతుంది. రాఖీలను పంపడం మీవంతు – … Read more

    మునుగోడు కోసం పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు… టీఆర్ఎస్ నుంచి కొత్త అభ్యర్థి?

    మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసేంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మునుగోడు స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈనెల21న అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.దీంతో మునుగోడు ఉపఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలవనున్నట్లు తేలిపోయింది. అటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టి బరిలో నిలిచి గెలిచే బలమైన … Read more

    నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D1

    SSLV-D1 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఈ ప్రయోగం ద్వారా భూపరిశీలన ఉపగ్రహంతో పాటు విద్యార్థులు తయారు చేసిన అజాదీ శాట్‌ను రోదసిలోకి పంపింది. ఈ రెండు ఉపగ్రహాలను కొద్దిసేపట్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. #WATCH ISRO launches SSLV-D1 carrying an Earth Observation Satellite & a student-made satellite-AzaadiSAT from Satish Dhawan Space Centre, Sriharikota (Source: ISRO) pic.twitter.com/A0Yg7LuJvs — ANI (@ANI) August 7, 2022

    లైవ్‌లో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్

    తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రసంగిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, మునుగోడు ఉపఎన్నిక, TRS పార్టీలో పార్టీలో చేరికలపై స్పందించనున్నారు. పైన వీడియో బటన్ క్లిక్ చేసి లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

    లక్ష కెమెరాల స్క్రీన్ ను ప్రారంభిస్తున్న కేసీఆర్

    హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. రూ. 600 కోట్లతో నిర్మించిన ఈ సెంటర్ తెలంగాణ పోలీసింగ్ కు తలమానికంగా నిలవనుంది. ఇక్కడ ఒకేసారి లక్ష సీసీ కెమెరాల విజువల్స్ చూడగలిగే వాల్ అందుబాటులో ఉంటుంది. 10 లక్షల సీసీ కెమెరాల ఫీడ్ అంటే 30 పెటాబైట్ల స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి మూలనూ ఒక్క చోటు నుంచి పర్యవేక్షించే సదుపాయం రాబోతోంది.

    ఆన్ లైన్లో ఆర్డర్ చేయకున్నా ఇంటికి వస్తే జాగ్రత్త..ఓటీపీ స్కామ్!

    ఓటీపీ ఫ్రాడ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆన్ లైన్లో వస్తువులు ఆర్డర్ పెట్టకున్నా కూడా మీకు ఆర్డర్ వచ్చిందని పలువురు ఇళ్లకు వస్తున్నారు. ఆ క్రమంలో నమ్మిన వారిని ఆర్డర్ క్యాన్సల్ చేయడానికి ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. ఇక ఓటీపీ చెప్పగానే వారి బ్యాంకు అకౌంట్ నుంచి వేలకు వేలు దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేసి సూచిస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసి తెలుసుకోండి. ఆర్డర్ … Read more