• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భార్యను కాపాడుకున్న అండర్‌టేకర్

    WWE మాజీ ప్లేయర్ అండర్ టేకర్ అలియాస్ మార్క్ కాలవే సొరచేప దాడి ముప్పు నుంచి భార్యను కాపాడుకున్నాడు. రింగ్‌లోనే కాకుండా నిజ జీవితంలోనూ తన ధైర్యాన్ని ప్రదర్శించి సొరచేపను తరిమి కొట్టాడు. ఓ బీచ్‌లో భార్యతో కలిసి గడుపుతుండగా ఉన్నట్టుండి సొరచేప ఆమె వైపు దూసుకొచ్చింది. దీంతో అక్కడే నిల్చున్న అండర్ టేకర్ అడ్డుగా వెళ్లడంతో సొరచేప వెనక్కి తగ్గింది. కాసేపటి దాకా అలాగే పహారా కాయగా సొరచేప తప్పించుకుని పారిపోయింది. ఈ వీడియోని అండర్‌టేకర్ భార్య పంచుకుంది. https://www.instagram.com/p/CufEU8uOSPl/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

    బీచ్‌లో జో బైడెన్‌ సందడి

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ డెలావర్‌ బీచ్‌లో సరదాగా గడిపారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్, మనవరాలు ఫిన్నెగన్‌తో కలిసి బీచ్‌లో కాసేపు సన్‌ బాత్‌ తీసుకున్నారు. కుటుంబంతో కలిసి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ పని ఒత్తిళ్ల నుంచి రిలాక్సయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయిదు రోజుల యూరప్‌ పర్యటనకి వెళ్లడానికి ముందు బైడెన్‌ ఈ సన్‌ బాత్‌ చేశారు. The most powerful man in the world. After sending cluster bombs … Read more

    తానా సభలో కొట్టుకున్న తెలుగు తముళ్లు

    తానా సభలో తెలుగు తమ్ముళ్ల కొట్లాట వైరల్ అవుతోంది. రెండుగా చీలిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. సభలో జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరగడం గమనార్హం. ఈ ఘటనపై నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తానా … Read more

    ప్రాన్స్‌లో ఉద్రిక్తతలు

    పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి చెందిన ఘటనపై పౌర సమాజం ఆందోళనలు ఫ్రాన్స్‌లో మిన్నంటాయి. పౌరులు పెద్దఎత్తున విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఆందోళనలను కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది బలగాలను మోహరించింది. ఈ క్రమంలో దేశంలో అశాంతి పరిస్థితులు నెలకొన్న వేళ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళనల సమయంలో ఆయన మ్యూజిక్ కచేరీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. This isn’t Syria, Iraq or Afghanistan. This is France where … Read more

    ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం

    ఈజిప్టు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ దక్కింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి దీనిని అందజేసి సత్కరించారు. 1915లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని, మానవాళికి విశేష సేవలందించే నేతలకు అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఇది 13వ పురస్కారం కావడం విశేషం. మరోవైపు ఈ పర్యటనలో 11వ శతాబ్దం నాటి అల్‌- హకీం- మసీదును ప్రధాని సందర్శించారు. అలాగే ప్రసిద్ద గిజా పిరమిడ్లను వీక్షించారు. Prime Minister @narendramodi visits … Read more

    భారత జాతీయ గీతంతో ఆకట్టుకున్న అమెరికా సింగర్

    అమెరికా హాలీవుడ్ నటి, ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ భారత జాతీయ గీతాన్ని పాడి భారతీయల మనసులను దోచుకున్నారు. అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన ముగింపు కార్యక్రమంలో మేరీ భారత జాతీయ గీతాన్ని ఆలాపించారు. అనంతరం మోదీ పాదాలను తాకి ఆశీర్వదం తీసుకున్నారు. భాతర ప్రధాని కోసం ఆ దేశ గీతాన్ని ఆలాపించడం గర్వంగా ఉందని తెలిపారు. అమెరికా భారత గీతాలు రెండు ప్రజాస్వామ్యానికి స్వేచ్చకు ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. Indian culture possesses a remarkable beauty, as its values transcend … Read more

    మహిళను వర్షంలో వదిలివెళ్లిన పాక్ ప్రధాని

    పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రాన్స్ టార్‌కు వెళ్లిన ఆయన ఓ మహిళను వర్షంలోనే వదిలి వెల్లడంపై విమర్శలు వస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ఓ సదస్సుకు ప్రధాని హాజరవుతున్న సమయంలో అక్కడ వర్షం పడుతుంది. మహిళా ప్రోటోకాల్ అధికారి ఆయన కోసం గొడుగు పట్టింది. ఆమెతో మాట్లాడుతూ కొంత దూరం నడిచిన షరీఫ్ గొడుగు తీసుకుని మహిళను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ వీడియా సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. Prime Minister of … Read more

    మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: మోదీ

    ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో మాట్లాడిన ప్రధాని, పరోక్షంగా పాకిస్థాన్​కు చురకలంటించారు. భారత్​ ప్రస్తుతం 5వ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు వైట్​హౌస్​లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఏర్పాటు చేసిన విందుకు ప్రధాని మోదీ సహా వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. గూగుల్‌ సీఈఓ సుందర్ పిచ్చాయ్‌ కూడా విందులో పాల్గొన్నారు. #WATCH | Our vision is 'Sabka … Read more

    డ్యాన్స్ చేసిందని సర్టిఫికేట్ ఇవ్వలేదు

    గ్రాడ్యుయోషన్ పట్టా తీసుకునేందుకు డ్యాన్స్ చేస్తూ వెళ్లిన విద్యార్థినికి ప్రిన్సిపల్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో అమ్మాయి ఏడుస్తూ స్టేజ్‌పై నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. అమెరికాలోని ది ఫిలడెల్ఫియా హై స్కూల్‌ల్లో సర్టిఫికేట్ ఇచ్చేందుకు అబ్ధుర్ రహ్మాన్‌ను (17) పిలవగానే ఆమె డ్యాన్స్ చేస్తూ వెళ్లింది. దీనిపై ప్రిన్సిపల్ అభ్యంతరం తెలుపుతూ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించి పంపించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో వైరలైంది. AT 4:30: This is video of Hafsah Abdur-Rahman dancing across stage to … Read more

    నేపాల్‌లో పోటెత్తిన వరదలు

    నేపాల్‌ను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షాల ప్రభావంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకి ఇంకా లభించలేదు. భారీగా వానలు కురుస్తుండటంలో హేవా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నదికి ఆనుకొని ఉన్న ఇళ్లు కొట్టుకు పోయాయి. మరి కొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంలో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #WATCH | Flash … Read more