• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి’

    బాలేశ్వర్ రైలు ప్రమాదంపై ప్రపంచదేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. The images and reports of the train crash in Odisha, India break my heart. I’m sending my deepest condolences … Read more

    నడుస్తూ కిందపడ్డ జో బైడన్

    అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో స్టేజ్‌పై నడుస్తూ ఒక్కసారిగా కిందపడ్డారు. ముందున్న గాడ్స్ ఆయనను నెమ్మదిగా పైకిలేపారు, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ బైడన్‌ మానసింకంగానే కాదు, ఇప్పుడు నడవడానికి కూడా కష్టంగా ఉంది. అమెరికన్ల రక్షణ కోసం పార్లమెంట్ ఇప్పుడు రాజ్యంగంలో 25వ సవరణను తెర మీదకు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేశాడు. ? BREAKING: Joe Biden falls at the … Read more

    రాహుల్ సభలో ఖలీస్థానీల హల్‌చల్

    కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సభలో ఖలీస్థానీ మద్ధతుదారులు హల్‌చల్ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ సమావేశంలో రాహుల్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఖలీస్థానీ మద్ధతుదారులు నినాదాలు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే రాహుల్ స్పందిస్తూ ‘‘విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణాలు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Rahul Gandhi heckled for the 1984 Sikh genocide (unleashed by the Congress), in America… ऐसी नफ़रत … Read more

    మోదీజీ దేవుడికే పాఠాలు చెబుతారు: రాహుల్

    ప్రధాని మోదీ భారత ప్రజలను భయపెడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడి ప్రవాస భారతీయులతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంతా తమకే తెలుసనుకునే వారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. చరిత్రకారులకే చరిత్ర చెప్పేలా, సైన్యానికే యుద్ధం నేర్పేలా చేస్తారు. చివరికి దేవుడికి కూడా పాఠాలు చెప్పేలా తయారయ్యారు. అలాంటి వారిలో ఒకరు మోదీ’ అంటూ కాలిఫోర్నియాలో జరిగిన మీటింగ్‌లో రాహుల్ విరుచుకు పడ్డారు. Just listen the speech of Mr #RahulGandhi "Santa … Read more

    రాత్రికి రాత్రే నగరం రంగు మారింది

    ఇటలీ నగరం వెనిస్‌లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. నీటి నగరంగా పేరుగాంచిన వెనిస్‌లో గ్రాండ్‌ కెనాల్‌ నీటి రంగు.. రాత్రికి రాత్రే మారిపోయింది. బ్లూ కలర్‌లోని కాలువ రంగు గ్రీన్ కలర్‌లోకి మారిపోయింది. మరోవైపు సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. రంగు మారడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాలువలో నాచు పెరిగిపోవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. The water in the Grand Canal in Venice has turned bright … Read more

    ఒంటిపై రక్తంతో సెలబ్రిటీ నిరసన

    [VIDEO](url): కేన్స్‌ సినీ ఉత్సవంలో ఓ మహిళ అలజడి సృష్టించింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిరసన చేపట్టిన ఆమె శరీరానికి నకిలీ రక్తం రాసుకుని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. రష్యా సాగిస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నెత్తుటి దారులు ఏరులై పారుతున్నాయనడానికి సంకేతంగా ఆ మహిళ ఇలా నకిలీ రక్తంతో నిరసన ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. A woman wearing a dress the … Read more

    కప్పు ఐస్‌క్రీం ధర రూ.5.2 లక్షలు

    జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌లలో సెలాటో ఒకటి. తాజాగా సెలాటో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీంను తయారు చేసింది. దీని ధర 8,73,400(రూ.5.2లక్షలు) యెన్‌లు. ఎందుకంత ధర అంటే ఐస్‌క్రింను అరుదైన పదార్థలతో తయారు చేశారు. ఈ ఐస్‌క్రీం తయారీలో ఉపయోగించిన వైట్‌ ట్రఫుల్‌ అనే అరుదైన పదార్థాన్ని వాడారు. దీని ధర కిలోకు 2 మిలియన్‌ జపనీస్‌ యెన్‌లు ఉంటుందట. ఇటలీలో మాత్రమే దొరికే దీని సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనితో పాటు పర్మిజియానో రెగ్గియానో అనే చీజ్‌, సేక్‌ … Read more

    గిన్నిస్‌లో చోటు దక్కించుకున్న వెడ్డింగ్‌ గౌన్

    [VIDEO](url): పెళ్లి కుమార్తె కోసం చేసిన ఓ వెడ్డింగ్‌ గౌన్ ఏకంగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించింది. ఇటలీకి చెందిన బ్రైడల్‌ డిజైనర్‌ మిచెలా ఫెర్రిరో ఈ గౌను రూపొందించారు. 50,890 క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా వెడ్డింగ్‌ గౌన్‌ను డిజైన్‌ చేశారు. దీని తయారీకి నాలుగు నెలల సమయం పట్టినట్లు డిజైనర్‌ మిచెలా ఫెర్రిరో తెలిపారు. ఈ ప్రత్యేకమైన గౌనును ఓ ఫ్యాషన్‌ షోలో ప్రదర్శించారు. గతంలో టర్కీకి చెందని డిజైనర్‌ 45,024 క్రిస్టల్‌తో వెడ్డింగ్‌ గౌనును డిజైన్ చేసి రికార్డు కెక్కారు. New record: … Read more

    పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ అరెస్ట్

    పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఆయనను మంగళవారం పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. భారీ సంఖ్యలో వచ్చిన పాక్ రేంజర్లు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ తరఫు న్యాయవాదులపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇమ్రాన్ అరెస్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Rangers abducted PTI Chairman Imran Khan, these are the visuals. Pakistan’s brave people must come … Read more

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్‌పై హత్యాయత్నం!

    తమ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ కుట్ర చేసిందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. మాస్కోలోని పుతిన్ అధికారిక నివాసంపై ఉక్రెయిన్‌కు చెందిన రెండు డ్రోన్లు దాడికి దిగగా కూల్చివేసినట్లు తెలిపింది. దీనిని ఉగ్ర కుట్రగా భావిస్తున్నామని రష్యా పేర్కొంది. రష్యా బలగాలు పూర్తి స్థాయి సామర్ధ్యంతో ఉన్నాయని.. శత్రువులు ఏ రూపంలో వచ్చినా ధీటుగా ఎదుర్కొంటామని తెలిపింది. కాగా మాస్కోలో డ్రోన్ల వినియోగం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. KREMLIN DRONE ATTACK – Russia says two Ukrainian drones attacked Kremlin … Read more