• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విమానం గాల్లో ఉండగా మంటలు

    [VIDEO](url): అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్‌ గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. కొలంబస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానం టేకాఫ్‌ అయిన 25 నిమిషాలకే ఓ పక్షుల గుంపు దాన్ని ఢీ కొట్టింది. దీంతో విమానం కుడి వైపునున్న ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. American Airlines 737 returns … Read more

    ఆకాశంలో భారీ వెలుగు.. హడలిపోయిన ప్రజలు

    [VIDEO](url): ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ గగనతలంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. నాసాకు చెందిన ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశించడం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుందని అధికారులు ప్రకటించారు. అంతకుముందు ఈ వెలుగును చూసిన కీవ్‌ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రష్యా వైమానిక దాడులు చేస్తోందని భయపడ్డారు. దీనికి అనుగుణంగా ఉక్రెయిన్‌ సైన్యం నుంచి వైమానిక దాడి హెచ్చరికలు జారీ అయ్యాయి. వెలుగు దృశ్యాలను పలు ఉక్రెయిన్‌ ఛానెళ్లు ప్రసారం కూడా చేశాయి. అయితే దీనిపై నాసా క్లారిటీ ఇవ్వడంతో కీవ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. … Read more

    BBC అంటే ఏంటి?: ఎలన్ మస్క్

    బీబీసీ పూర్తి పేరేంటో తనకు తెలియదని చెప్పి ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల బీబీసీ ఛానె‌ల్‌ని ప్రభుత్వ ప్రోత్సాహక మీడియా సంస్థ‌గా గుర్తిస్తూ ట్విటర్ బ్లూ వెరిఫికేషన్ ఇచ్చారు. అయితే, దీనిపై బీబీసీ అభ్యంతరం వ్యక్తం చేసిందంటూ ఓ వెబ్‌సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌కి మస్క్ రిప్లై ఇచ్చారు. ‘ఇప్పటికీ నాకు BBC అంటే తెలియట్లేదు. ప్రతీసారి మర్చిపోతున్నా. అసలేంటీ BBC అంటే?’ అని [ట్వీట్](url) చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మస్క్ చలాకీ తనం గురించి చర్చిస్తున్నారు. … Read more

    20న సూర్యగ్రహణం; మనకు ఉంటుందా?

    ఈ ఏడాది ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.29 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం అమావాస్య తిథి నాడు ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. దీంతో సూతక కాలం ఉండదు. ఈ గ్రహణం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. 2023లో మెుత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో రెండు చంద్ర గ్రహణాలు కాగా, మిగిలినవి సూర్య … Read more

    సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం; 20 మంది అక్కడికక్కడే..

    [వీడియో; ](url)సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. యాసిర్ ప్రావిన్స్‌లోని అక్వాబా షార్ వద్ద హజ్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు వేగంగా వెళ్తూ బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి బయటకు రాలేక 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 29 మంది గాయాల పాలయ్యారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ?? A bus carrying pilgrims from Umrah … Read more

    కరోనా ల్యాబ్ నుంచి లీక్ కాలేదట

    రాకూన్ జాతి కుక్కల నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చినట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. దీన్ని బట్టి కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదన్న విషయం అర్థమవుతోంది. చైనా ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయిందని అమెరికా శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మార్కెట్‌లో రాకూన్ కుక్కల మాాంసాన్ని విక్రయించడం ద్వారా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, రాకూన్ కుక్కకు కోవిడ్ ఉంటే అది మానవులకు సోకి ఉండకపోవచ్చని అభిప్రాయ పడ్డారు. మానవుల నుంచే … Read more

    పుతిన్‌కు ఐసీసీ అరెస్ట్ వారెంట్

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రదేశాల నుంచి పిల్లలను అక్రమంగా రష్యాకు తరలించిన నేరానికి పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా బెలోవాకు కూడా వారెంట్ ఇచ్చినట్లు పేర్కొంది. కాగా ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేయవచ్చని.. కానీ నిందితులను అరెస్ట్ చేసే హక్కు ఏమాత్రం లేదని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిథి స్పష్టం చేశారు.

    టర్కీలో భూకంపం వచ్చిన చోటే వరదలు

    [VIDEO:](url) భూకంప వినాశనం నుంచి కోలుకోక ముందే టర్కీని వరదలు ముంచెత్తాయి. ఫిబ్రవరిలో భూంకంపం సంభవించిన చోటే ఇలా పెను వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల తాకిడికి సాన్లిఉర్ఫా నగరంలో 11 మంది, అడియామన్‌లో ఇద్దరు మృతి చెందారు. బురదతో కూడిన భారీ వరదలకు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇటీవలి భూంకపంతో నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఈ వరదలు శాపంగా మారాయి. భూకంపం కారణంగా దాదాపు 48వేల మందికి పైగా మృతిచెందారు. Several injured & killed after massive floods … Read more

    ఇదండీ ఫిజిక్స్ అంటే.. ఈ వీడియోను చూశారా?

    [VIDEO:](url) సైన్స్‌లో రారాజుగా ఫిజిక్స్‌ని పిలుస్తుంటాం. భౌతిక శాస్త్ర నియమాలను ఆసరాగా చేసుకుని మ్యాజిక్ చేయొచ్చు. చాలామంది మెజీషియన్లకు ఫిజిక్స్ ఒక జీవనాధారం. అయితే, ఊహకు అందని కొన్ని చర్యలు ఫిజిక్స్ ద్వారా సాధ్యమవుతాయి. ఇందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఇందులో కొన్ని ప్రయోగాలను చేసి చూపించారు. ఒక సొల్యూషన్‌లో వేస్తే రాగి తీగ వ్యాకోచం చెందడం, మరో సొల్యూషన్‌లో ఉంచితే తిరిగి యథాస్థితికి చేరడం; మాగ్నెటైజేషన్ ద్వారా ఓ వస్తువు తిరిగేలా చేయడం, చిన్నపాటి బొంగరాన్ని గాలిలో తిరిగేలా చేయడం.. ఇలా అన్నీ … Read more

    అమెరికాలో మంచు తుపాను బీభత్సం!

    [VIDEO](url): అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌, లూసియానా రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. కాలిఫోర్నియాలో కొన్ని అడుగుల ఎత్తు వరకు మంచు పేరుకుపోయింది. మంచు ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. డాలస్‌కు రాకపోకలు సాగించే వందలాది విమానాలు రద్దయ్యాయి. టెక్సాస్‌లో గం.145కి.మీ వేగంతో గాలులు వీయోచ్చని అక్కడి వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. Brand new drone video from SkyView 30 shows all the snow at … Read more