చిరుతలు గర్జించవు తెలుసా!
సాధారణంగా మనుషులకి జంతువలంటే చాల భయం అందులోను సింహాలు పులులు అంటే మరి ఎక్కువే వాటి గర్జన వింటేనే వణుకు పుడుతుంది. కానీ చిరుతలు గర్జించవు, అవి ఇంటి పిల్లుల మాదిరిగా మియావ్ అంటూ అరుస్తాయని తెలుసా!
సాధారణంగా మనుషులకి జంతువలంటే చాల భయం అందులోను సింహాలు పులులు అంటే మరి ఎక్కువే వాటి గర్జన వింటేనే వణుకు పుడుతుంది. కానీ చిరుతలు గర్జించవు, అవి ఇంటి పిల్లుల మాదిరిగా మియావ్ అంటూ అరుస్తాయని తెలుసా!
[VIDEO](url): తాజాగా వైరల్ అవుతున్న వీడియలో మహిళ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ మహిళ నాన్‌చాక్‌తో కొవ్వొత్తులను ఆర్పడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ఈ ఫీట్ చేయడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. This woman looks like she came out of a ninja movie pic.twitter.com/m163kz9oNz — Next Level Skills (@NextSkillslevel) January 28, 2023
[VIDEO](url): నమ్మశక్యం కానీ ఒక 3డి ఎఫెక్ట్స్ తో కూడిన బిల్ బోర్డ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజంగానే ఒక సింహం బయటకి దూకినట్టు కనిపించడంతో అక్కడ దెగ్గరగా ఎవరైనా నిలబడి ఉన్నారంటే వాళ్ళు ఉలిక్కిపడిపోవాల్సిందే, ఈ వీడియో ట్విట్టర్ లో చెక్కర్లు కొడుతుండడంతో చూసినవారందరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు, కళ్ళు చెదిరేలా ఉన్న ఈ బిల్ బోర్డ్ చైనా లో ఉంది. Unbelievable 3D billboard in China ? pic.twitter.com/CgmOYZPlac — Erik Solheim (@ErikSolheim) January 28, 2023
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఓ మసీదులో జరిగిన [బాంబు పేలుడు](url) ఘటనలో ఇప్పటివరకు 83 మంది మరణించారు. 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా సోమవారం పెషావర్‌లోని ఓ మసీదులో పీటీఐ ఉగ్రవాదులు బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మసీదు పైకప్పు కుప్పకూలిపోయింది. దీంతో శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. వారందరూ విగతజీవులుగా మారుతున్నారు. కాగా క్షతగాత్రులకు రక్తదానం చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. Saddened to see this……More than 50 killed in … Read more
రహదారిపై గాయాలతో పడి ఉన్న కుక్కను ఓ వ్యక్తి కాపాడాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏదో వాహనం ఢీకొట్టటంతో కుక్క అపస్మారక స్థితిలో రోడ్డుపైనే పడి ఉంది. ఇది గమనించిన ఓ యువకుడు దానిని కాపాడి.. ఇంటికి తీసుకెళ్లి గాయాలకు ప్రథమ చికిత్స అందించాడు. అతడి నిస్వార్థ సేవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. https://www.instagram.com/reel/Cnevd5mpuDL/?utm_source=ig_web_copy_link
[VIDEO:](url) గూగుల్ పేజ్‌లో ఇవాళ సరికొత్త డూడుల్ ప్రత్యక్షమయ్యింది. హోమ్ పేజ్‌లో పర్ఫెక్ట్ బబుల్ టీ తయారు చేయడం ఎలా అనే ఓ ఆటను ఉంచింది. ఇందులో డూడుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. థాయ్‌లాండ్ సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ బబుల్ టీ ఫేమస్. ప్రస్తుతం ఈ టీకి చాలా గుర్తింపు లభించింది. 2020లో ఇదే రోజున బబుల్ టీని ప్రమోట్ చేస్తూ గూగుల్ డూడుల్‌ను పెట్టింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ డూడుల్‌లో ఓ గేమ్‌ను తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ అవుతోంది. … Read more
కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మంచులో ఆడుకున్నారు. జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లో వీరిద్దరూ స్నో బాల్స్‌తో సరదాగా ఫైట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ తన సోదరి ప్రియాంకపై స్నో బాల్స్ విసరడం, మళ్లీ ప్రియాంకం రాహుల్‌పై మంచు గడ్డలు విసురుకున్నారు. మంచుగడ్డల్లో వారిద్దరూ చిన్న పిల్లల్లా మారిపోయారు. ఒకరిపై ఒకరు మంచు విసురుకుంటూ సరదాగా గడిపారు. Sheen Mubarak!? A beautiful last morning at the #BharatJodoYatra … Read more
[VIDEO](url):ఆస్ట్రేలియాలో ఖలీస్థానీలు రెచ్చిపోయారు. వీధుల్లో భారత జాతీయ జెండాను ఎగురవేసినందుకు వారిపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలు పట్టుకుని భారతీయ జెండాను పట్టుకున్నవారిపై రాడ్లతో దాడి చేశారు. దీనిపై పలువురు భారతీయులు స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకుని తగు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. Indians from the Hindu community beaten up by Khalistanis for waving Indian flag on the streets of Australia Khalistani Terrorism is a ticking bomb #KhalistanReferendum pic.twitter.com/vb5RrszPE7 … Read more
[VIDEO:](url) చాలా రోజుల తర్వాత ‘కాలా చష్మా’ సాంగ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా తైవాన్ యూత్ ఈ పాటకు వేసిన డ్యాన్స్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ స్టెప్పులను మీరు కూడా ఆస్వాదించండి. ఈ సాంగ్ బార్ బార్ దేఖో చిత్రంలోనిది. View this post on Instagram A post shared by 来年 ∞ (@ulzzang.mr)
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు లాంక్‌షైర్ పోలీసులు జరిమానా విధించారు. కారులో [సీటు బెల్టు](url) ధరించకుండా ప్రయాణించినందుకు రూ.10 వేల (100 పౌండ్లు) జరిమానా విధించారు. ప్రధాని అయ్యి ఉండి సీటు బెల్టు పెట్టుకోకుండా ఎలా ప్రయాణిస్తారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా యూకే చట్టాల ప్రకారం కారులో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా సీటు బెల్టు ధరించాలి. లేదంటే 100 పౌండ్ల ఫైన్ చెల్లించాలి. కోర్టు వరకు వెళ్తే 500 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. Does he know how awfully patronising he comes across? … Read more