• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాను వణికిస్తోన్న బాంబ్ సైక్లోన్‌

    అగ్రరాజ్యం అమెరికా ఇంకా మంచు దుప్పట్లోనే ఉంది. బాంబు సైక్లోన్ భీభత్సంతో అమెరికాలో ఎటుచూసినా మంచే కనపడుతోంది. రహదారులు, కార్లు పూర్తిగా [మంచు](url)తో కప్పి ఉన్నాయి. ఉత్తర అమెరికాలో అత్యల్పస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉంటున్నారు. విద్యుత్ కోతల వల్ల హీటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు అల్లాడతున్నారు. మంచు తఫాన్ కారణంగా ఇప్పటివరకు 26 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలు విమానాశ్రయాలు కూడా మూతపడ్డాయి. A powerful arctic blast has turned deadly in North America, where powerful … Read more

    ఇమ్రాన్ ఖాన్ ఆడియో క్లిప్ వైరల్

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ బూతు [ఆడియో](url) క్లిప్‌లు వైరల్‌గా మారాయి. ఓ ఆడియో క్లిప్‌లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఉంది. ఆ మహిళను వ్యక్తిగతంగా కలవాలని కోరుతున్నట్లు ఉంది. సదరు మహిళ బాధల్లో ఉన్నట్లు తెలిపింది. తర్వాతి రోజు కలుసుకోవడంపై వారు మాట్లాడుకున్నారు. ఆ రోజు తన భార్యాపిల్లలు వస్తున్నారని, వారిని ఆలస్యంగా రమ్మంటానని చెబుతాడు. ఏ విషయం మరుసటి రోజు చెబుతానని ఫోన్ పెట్టేస్తాడు. కాగా ఈ ఆడియో క్లిప్ తనకు సంబంధించి కాదని ఇమ్రాన్ కొట్టేశాడు. pakistan's … Read more

    జగజ్జేతలకు ఘన స్వాగతం

    ఫిఫా వరల్డ్‌కప్ విశ్వవిజేత అర్జెంటీనా జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. బ్యూనస్‌ఎయిర్స్‌లోని ఎజీజీ విమానాశ్రయం వద్ద లక్షలాది అభిమానులు మెస్సీ బృందానికి వెల్‌కమ్ చెప్పారు. తమ జట్టు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానాన్ని ఓ యాప్ సాయంతో ట్రాక్ చేసి మరీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. బ్యూనస్‌ఎయిర్స్‌లో ఆటగాళ్లకు అడుగడు గునా నీరాజనాలు పలికారు. ఆటగాళ్లు ట్రోఫీని ప్రదర్శిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. మెస్సీ.. మెస్సీ.. అంటూ హోరెత్తించారు.

    అర్జెంటీనాలో ఫ్యాన్స్ హంగామా

    ఫ్రాన్స్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. రాజధాని బ్యూనోస్ ఐరీస్‌లో ఫ్యాన్స్ రోడ్లపైకి పెద్ద సంఖ్యలో తరలివచ్చి హంగామా చేశారు. వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. కొందరు చొక్కాలు చింపేసి దేశ జెండాను ప్రదర్శిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. 36 ఏళ్ల తర్వాత మళ్లీ కల నెరవేరడంతో భావోద్వేగానికి గురయ్యారు. చిన్న పెద్దా తేడా లేకుండా వేడుకలు జరుపుకున్నారు. మెస్సీ తమ కలను సాకారం చేశాడని తెగ సంబరపడుతున్నారు.

    దద్దరిల్లిన అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్

    ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన ఆనందంలో అర్జెంటీనా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులు హంగామా చేశారు. ప్లేయర్లందరూ కలసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ డైనింగ్ టేబుల్‌పై డ్యాన్స్ చేశాడు. ఒకరిపై ఒకరు షాంపేన్ జల్లుకుంటూ సందడి చేశారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ బిజీబిజీగా గడిపారు. ట్రోఫీని ముద్దాడటానికి ఆటగాళ్లు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    మెస్సీ మ్యాజిక్ గోల్స్ చూశారా?

    అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కల సాకారమైంది. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఉత్కంఠ పోరులో ఇరు జట్లు 3-3 గోల్స్ చేయడంతో షూటౌట్‌కు దారి తీసింది. అర్జెంటీనా షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచింది. అర్జెంటీనా తరఫున్ మెస్సీ 2 కళ్లు చెదిరే గోల్స్ కొట్టాడు. మరో వైపు ఫ్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబాపే 3 గోల్స్‌తో పోరాడినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని గోల్స్‌ను మీరూ చూసేయండి.

    అర్జెంటీనా అధ్బుత పోరాటం

    ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఉత్కంఠ [విజయం](url) సాధించింది. చివరి వరకూ పట్టు విడవకుండా పోరాడి పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా గట్టెక్కింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ మాయాజాలంతో అర్జెంటీనా ఫస్టాఫ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు కూడా 2 గోల్స్ కొట్టడంతో మ్యాచ్ సమమైంది. దీంతో ఎక్స్‌ట్రా టైంలోనూ రెండు జట్లు గోల్ కొట్టలేకపోయాయి. పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ??❤️ Another game closer… — FIFA World Cup … Read more

    డజను గోల్స్‌ను చూసి తీరాల్సిందే

    ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభమైన 12వ రోజు గోల్స్ వర్షం కురిసింది. ఆ రోజు మొత్తం 4 మ్యాచ్‌లు జరగ్గా 12 గోల్స్ నమోదయ్యాయి. ప్రపంచ అగ్ర శ్రేణి జట్టు బెల్జియం ఓటమితో ఇంటిదారి పట్టింది. తన చివరి మ్యాచ్‌లో క్రొయేషియాతో 0-0తో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగింది. మరోవైపు అర్జెంటీనా ముందడుగు వేసింది. పోలాండ్‌ను ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. ఇక మెక్సికోను దురదృష్టం వెంటాడింది. చివరి మ్యాచ్‌లో గెలిచినా వరల్డ్‌కప్ నుంచి తప్పుకోక తప్పలేదు.

    బద్ధలైన అగ్నిపర్వతం

    అమెరికాలోని హవాయ్ మౌనా లావోప్రపంచంలోనే అత్యంత పెద్దదైనా అగ్ని పర్వతం బద్దలయ్యింది. 1984 తర్వాత మళ్లీ జరగటం ఇదే మెుదటిసారి. అగ్నిపర్వతం ధాటికి ఆ ప్రాంతంలో ఆకాశం ఎర్రగా మారినట్లు కనిపించింది. ఆ ప్రాంతంలో భూకంపం రావటంతోనే విస్పోటనం జరిగిందని భావిస్తున్నారు. [లావా](url) అక్కడే ఉందని, అందువల్ల దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తున్నారు. Mauna Loa eruption shots from early this morning. Flights cancelled in and out of local airports… strap in … Read more

    ‘వైట్‌పేపర్‌’తో అట్టుడుకుతున్న చైనా

    చైనాలో ‘జీరో కోవిడ్’కు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరం అవుతోంది. చైనా ప్రజలు[ ‘వైట్‌పేపర్’ ](url)విప్లవం చేస్తున్నారు. తెల్ల పేపర్‌పై ఏమీ రాయకుండానే వారు నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కాగా జీరో కోవిడ్ పేరిట ప్రజలను మూడేళ్లుగా చైనా నిర్బంధించింది. అన్ని దేశాల్లో మాస్కులు లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తుండగా.. చైనాలో మాత్రం ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. అందుకే వారు ఆందోళన చేస్తున్నారు. Hundreds of protesters in Beijing march with blank paper … Read more