• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోకి పాము

    లంక ప్రీమియర్‌ లీగ్‌లో మరోసారి పాము కలకలం రేపింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో నువాన్‌ ప్రదీప్‌ బౌలింగ్‌ చేసే ముందు ఫీల్డింగ్‌ సెట్‌ చేస్తుండగా గ్రౌండ్‌లోకి పాము ప్రవేశించింది. ఫీల్డ్‌ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. అయితే ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం ఆ పాము మైదానంలో నుంచి వెళ్లిపోయి బౌండరీ లైన్‌ అవతల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, Lucky escape for @IAmIsuru17 from … Read more

    జుకర్‌బర్గ్‌తో ఫైట్.. వెనక్కి తగ్గని మస్క్

    బిలియనీర్ ఎలాన్ మస్క్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ మధ్య జగడం అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ వరుస ట్వీట్లు ఇందుకు ఊతమిస్తున్నాయి. జుకర్‌బర్గ్‌తో చేయబోయే పోరాటాన్ని ‘ఎక్స్’(ట్విట్టర్)లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని ట్వీట్ చేశారు. ఈ డబ్బులు వృద్ధాశ్రమానికి విరాళం ఇస్తానని ప్రకటించారు. పైగా, ఈ ఎపిసోడ్ తొలి ఎక్స్-వీడియో కాబోతోందన్నారు. అంతకుముందు, మస్క్, జుకర్ ఓపెన్ ఛాలెంజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ‘రా చూసుకుందాం’ అంటూ సవాల్ విసురుకున్నారు. Zuck v Musk fight will be live-streamed on … Read more

    హిరోషిమా డే.. ప్రపంచంలో చీకటి రోజు

    ప్రపంచ చరిత్రలో పెను విధ్వంసం మొదలైంది ఈరోజు. 1945, ఆగస్టు 6న అమెరికా జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణు బాంబు దాడి చేపట్టింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికిన ఈ ఘటన ఆనాడు ఎన్నో వేల మంది జపనీయులను బలితీసుకుంది. ఇప్పటికీ అక్కడ అణు బాంబు సృష్టించిన భీకరానికి ఆనవాళ్లున్నాయి. అందుకే, ప్రతి సంవత్సరం ఈ రోజున జపాన్ ‘హిరోషిమా డే’ని శాంతి దినంగా పాటిస్తోంది. అణు బాంబు దాడితో కలిగే అనర్థాలు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

    ఏక్తాకు జాబ్ ఆఫర్ చేసిన ట్రూ కాలర్

    నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న యువతికి ట్రూ కాలర్ సీఈవో బాసటగా నిలిచారు. కెనడాలో ఉంటున్న ఏక్తాను ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు’ అని ఓ యూట్యూబర్ ప్రశ్నించారు. దీంతో ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ ఏక్తా బదులివ్వడం దుమారం రేపింది. దేశాన్ని వదిలేయడం డ్రీమా అంటూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో విమర్శలు పట్టించుకోవద్దని సీఈవో ఏక్తాకు సూచించారు. చదువు పూర్తయ్యాక ట్రూ కాలర్‌‌లో చేరొచ్చని జాబ్‌ ఆఫర్‌ చేశారు. Sad that we don’t get to see sunrise … Read more

    లోయలో బస్సు పడి 18మంది మృతి

    మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా, మిగతా వారికి గాయాలయ్యాయి. ప్రయాణ సమయంలో బస్సులో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారట. అతివేగంతో వస్తున్న బస్సు మూల మలుపు వద్ద టర్న్ తీసుకుంటుండగా ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 131 అడుగుల లోతులో బస్సు పడిపోయిందని, సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతున్నట్లు మెక్సికో ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ?Autobús de pasajeros cayó aun profundo barranco, de … Read more

    విరాట్‌ని కలిసిన జాషువా తల్లి

    వెస్టిండీస్ ప్లేయర్ జాషువా డా సిల్వా తల్లి విరాట్‌కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. రెండో టెస్టులో విరాట్ బ్యాటింగ్ చూడటానికి జాషువా తల్లి స్టేడియానికి వచ్చింది. మ్యాచ్ అనంతరం విరాట్‌ని కలిసి జాషువా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘విరాట్ ఎంతో మన్నికైన ఆటగాడు. అతడి ప్రతిభ అసాధారణం. ఈరోజు విరాట్‌ని కలవడం ఎంతో సంతోషం. నా కొడుక్కి కూడా అలా ఆడాలని చెబుతుంటా’ అంటూ ఆనంద భాష్పాలు కార్చారు. తొలి ఇన్నింగ్సులో విరాట్ 121 పరుగులు చేశాడు. Joshua Da Silva taking … Read more

    బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ, మెక్రాన్

    ఫ్రాన్స్ పర్యటనలో రెండో రోజు ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఫ్రాన్స్ స్వాతంత్య్ర వేడుకలకు భారత ప్రధాని గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో పాటు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ప్రథమ మహిళ(అధ్యక్షుడి భార్య) బ్రిగిట్టె మెక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాస్టిల్ డే పరేడ్‌ని సిబ్బంది నిర్వహించగా వీరు తిలకించారు. అంతకుముందు ప్రధానికి ఆ దేశ అత్యున్నత సైనిక, పౌర పురస్కారాన్ని మెక్రాన్ ప్రసాదించారు. #WATCH | Prime Minister Narendra Modi, French President Emmanuel Macron, France's First … Read more

    ప్రయోగదశలోనే పేలిన రాకెట్‌ ఇంజిన్

    జపాన్‌ తలపెట్టదలిచిన అంతరిక్ష ప్రయోగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న ఘన ఇంధన రాకెట్‌ ఇంజిన్‌ పరీక్షల సమయంలోనే పేలిపోయింది. ఈ విషయాన్ని జపాన్‌ స్పేస్‌ ఏజెన్సీ స్వయంగా ప్రకటించింది. గత అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్‌ ఇంజిన్‌ను జపాన్‌ ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు దానిలో మార్పులు చేసి ఎప్సిలాన్‌-S పేరుతో ఇంజిన్‌ను పరీక్షించబోయింది. ప్రయోగం మొదలైన 50సెకన్లలోనే అది పేలిపోయింది. Space Rocket Explodes One Minute into Test in … Read more

    విమానం క్రాష్ లాండింగ్: వీడియో వైరల్

    హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం క్రాష్ లాండింగ్ అయ్యింది. ఈఘటన సోమాలియా మొగదిషు విమానాశ్రయంలో జగింది. సాంకేతిక లోపం కారణంగా విమానం వేగంగా రన్ వే మీదకు దూసుకొచ్చింది. విమానం వేగంగా వచ్చి ప్రహారీ కంచె ఢీకొనడంతో విమాన ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో సహా 34 మంది ప్రయాణిస్తున్నారు. Video of aircraft type E120, operated by HALLA AIRLINE, crash landing on Runway … Read more

    హెలికాప్టర్ నడిపిన బీఆర్ఎస్ నేత

    బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెలికాప్టర్ నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రభాకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్‌లో ఆయన హెలికాప్టర్‌లో కో పైలెట్‌గా వ్యవహరించారు. పైలెట్‌గా తెలుగు వ్యక్తి గోపాల్ వ్యవహరించారు. న్యూయార్క్ నగరంపై కర్నె ప్రభాకర్ హెలికాప్టర్‌ను నడుపుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రభాకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. It was a great experience flying over New York City as … Read more