రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభ కోణంలో మాజీ డిఫెన్స్ సెక్రటరీ శశికాంత్ శర్మతో పాటు నలుగురు భారత వైమానిక దళ సిబ్బందిపై సీబీఐ అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. తొలుత CAGగా, 2011-13 మధ్యకాలంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసిన శర్మను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో సీబీఐ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటి ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్ (ప్రస్తుతం పదవీ విరమణ), డిప్యూటీ చీఫ్ టెస్ట్ పైలట్ ఎస్ ఏ కుంటే, అప్పటి వింగ్ కమాండర్ థామస్ మాథ్యూ, గ్రూప్ కెప్టెన్ ఎన్ సంతోష్ పేర్లను కూడా CBI పేర్కొంది. కాగా, ఈ కేసులో 2017 సెప్టెంబరులో మొదటి సారిగా మాజీ IAF చీఫ్ త్యాగి, ఇతరుల పేర్లతో ఆ తర్వాత.. మిచెల్, ఇతరులపై సెప్టెంబర్ 2020లో మరో ఛార్జ్ షీట్ దాఖలయింది.