తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను దాదాపు 9 గంటలపాటు ఢిల్లీలో సీబీఐ విచారించింది. నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కాల్ లిస్ట్, ఫొటోల ఆధారంగా వీరిద్దరినీ సీబీఐ విచారించింది. శ్రీనివాసరావు మీకు ఎలా తెలుసు? ఆయనకు మీకు సంబంధం ఏంటి? అంటూ ఇద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించారు. మున్నూరు కాపు సమావేశంలో కలుసుకున్నామని చెప్పారు. ఆయనతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని వారు స్పష్టం చేశారు. సంతకాలు తీసుకుని వారిని వదిలేశారు.