దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖకు సీబీఐ సమాధానమిచ్చింది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు కవిత వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు సీబీఐ అంగీకరించినట్లు బదులిచ్చింది. కాగా, ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని తొలుత సీబీఐ కవితకు నోటీసులు పంపించింది. అయితే, కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు ప్రతిని పంపిస్తేనే విచారణకు హాజరవుతానని కవిత తిరిగి సీబీఐకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు మేరకు 6వ తేదీన అందుబాటులో ఉండబోనని ఆమె అందులో స్పష్టం చేశారు. ఈ నెల 11, 12, 14, 15తేదీల్లో విచారణకు తన నివాసంలో అందుబాటులో ఉంటానని ఆమె చెప్పగా.. సీబీఐ అంగీకరించింది.
కవిత మెయిల్‌కు సీబీఐ రిప్లై

© ANI Photo(file)