ఏడాది పాటు వేడుకలు: కిషన్ రెడ్డి

© ANI Photo

తెలంగాణ విమోచన వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు పరేడ్ గ్రౌండ్‌లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి వచ్చిన 1300 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. కర్ణాటకలో హైదరాబాద్- కర్ణాటక ముక్తి దివాస్, మహారాష్ట్రలో మరఠ్వాడ ముక్తి దివాస్‌ పేరుతో ఎప్పటి నుంచో సెప్టెంబర్ 17న వేడుకలు జరుగుతున్నట్లు చెప్పారు. రేపు నిర్వహించే విమోచ దినోత్సవానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

Exit mobile version