తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వనపర్తిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసే సందర్భంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీఎం మోదీ మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను ప్రజలు బంగాళఖాతంలో కలుపుతారని మండి పడ్డారు. అలాగే నిరుద్యోగ యువతంతా ఈరోజు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని.. వారందరికీ అసెంబ్లీ సాక్షిగా శుభవార్త చెబుతామని కేసీఆర్ పేర్కొన్నారు.