AP: రాష్ట్రంలో 39 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని మంజూరు చేయాల్సి ఉందని రాజ్యసభలో ఎంపీ పరిమళ్ కొత్వానీ అడిగిన ప్రశ్నకు గడ్కరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బెంగుళూరు- విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం ప్రాధాన్యతతో కూడుకుంది. రూ.6,169 కోట్ల వ్యయంతో ప్యాకేజీ 1 నుంచి ప్యాకేజీ 6 వరకు పనులు చేపట్టనున్నారు.