సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మూడు నెలలకు కంపెనీలన ఆడిట్ చేయనుంది. ప్రస్తుతం ప్రతి నెలా సోషల్ మీడియా కంపెనీలు నివేదిక అందిస్తున్నాయి. అయితే ఇకపై ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, నిజంగా వారు ఐటీ నిబంధనలు పాటిస్తున్నారా?, ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారా? తదితర అంశాలను పరిశీలించనున్నారు. సోషల్ మీడియా కంపెనీల నిర్ణయాలను కూడా మార్చేలా ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది.