దురుద్దేశంతోనే కేంద్రం ఆదేశాలు: జగదీశ్ రెడ్డి

Courtesy Twitter: jagadish reddy

ఏపీకి విద్యుత్ బకాయిలు తెలంగాణ చెల్లించాలన్న కేంద్రం ఉత్తర్వులపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం దురుద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు. తెలంగాణకు రూ.12 వేల కోట్లు రావాలని ఎన్నోసార్లు కేంద్రానికి తెలిపినా దానిపై కేంద్రం స్పందించలేదన్నారు. ఇప్పుడు మాత్రం ఏపీ వాదనలు మాత్రమే వింటూ 30రోజుల్లో రూ.3 వేల కోట్ల చెల్లించాలంటోందని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం వైఖరీని దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఎండగడుతారని చెప్పుకొచ్చారు.

Exit mobile version