తెలంగాణలోని సుమారు రూ.40,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తుందని, దానిని వెంటనే ఆపేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని అనుకునేబదులు, వాటిని మరలా గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాలని, ఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. అది సాధ్యం కాకపోతే అలాంటి భూముల్లో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని కోరారు.