ఏపీ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జోన్ ఏర్పాటుకు డీపీఆర్ సమర్పించాక చాలా అంశాలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ఈ అంశాలను పరిశీలించడానికే గ్రేడ్ లెవల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం గత బడ్జెట్ లో కొత్తగా రాయగడ్ డివిజిన్ ఏర్పాటుకు 170కోట్లు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.