కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేడు పోలవరం పర్యటనకు వచ్చారు. ఆయన వెంట ఏపీ సీఎం జగన్, మంత్రి అనిల్ కుమార్ మరికొంత మంది అధికారులు ఉన్నారు. తాడువాయి పునారావాస కాలనీ నిర్వాసితులతో మాట్లాడి, అక్కడి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కాలనీలో మంచి వసతులు కల్పించినందుకు సీఎం జగన్ ను ప్రశంసించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని స్పష్టం చేశారు. పనులు పూర్తయ్యేలోపు మరోసారి పర్యటనకు వస్తానని పేర్కొన్నారు.