తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో భారీ అభివృద్ధిని సాధించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఐటీ రంగంలోని 10 ఉద్యోగాల్లో 3 తెలంగాణ రాష్ట్రానికి చెందినవే అని తెలిపింది. భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల శాఖ ప్రకారం తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలు, వాణిజ్య రంగంలో నెంబర్‌వన్‌గా నిలిచి ఐటీ సెక్టార్లో రోల్ మోడల్‌గా నిలిచింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తెలంగాణ 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, దీని ఫలితంగా దాదాపు 29,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ సెక్టార్లో 3.20 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందన్నారు. కొవిడ్ వల్ల అనేక రంగాలు దెబ్బతిన్నప్పటికీ తెలంగాణ ఐటీ ఎగుమతులు మాత్రం 12.98% వృద్ధి సాధించాయని ఆయన పేర్కొన్నారు.