కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను మంగళవారం విడుదల చేసింది. గత కొంతకాలంగా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో మొత్తం రూ.86,912 కోట్లు ఒకేసారి చెల్లిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2017లో జీఎస్టీ అమలు చేసిన సమయంలో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు పరిహారం అందిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌తో ఆ గడువు ముగుస్తుంది. ఇకపై రవెన్యూ లోటు లేకుండా రాష్ట్రాలే స్వయంగా ఆర్థిక వృద్ధిని సాదించాల్సి ఉంటుందని పేర్కొంది.