కేంద్రప్రభుత్వ వైఖరితో తెలంగాణకు తీరని నష్టం కలుగుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఏమాత్రం సహకారం లేదని ఆరోపించారు. మహబూబ్నగర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాల వాటా ఇప్పటికీ తేల్చలేదని మండిపడ్డారు. కేంద్రానిది పైన పటారం లోన లొటారం అన్నారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మోదీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాలతో సమానంగా కేంద్రం పని చేస్తేనే దేశంఅభివృద్ధి పథంలో నడుస్తుందని అభిప్రాయపడ్డారు.