“చోటూ ఏక్ చాయ్ ఔర్ ఏక్ సమోసా!” హైదరాబాద్ గల్లీల్లో ఈ మాట కామన్ కానీ ఇప్పుడు యూకేలోనే చాయ్, సమోసా పేరు మార్మోగుతోంది. తెల్లవారుజామున టీ, బిస్కట్ కన్నా చాయ్, సమోసానే బ్రిటన్ యువత ఎక్కువ ఇష్టపడుతోందట. యునైటెడ్ కింగ్డమ్ టీ అండ్ ఇన్ఫ్యూజన్స్ అసోసియేషన్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వెయ్యి మందిలో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్‌గా గ్రానోలా బార్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాన్ని మన సమోసా దక్కించుకుంది.