చల్లని గాలిలో అంటూ ఇటీవల విడుదలైన ప్రైవేట్ ఆల్బమ్ వీడియో సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు చిట్టి మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా, ప్రణవ్ కౌశిక్, శ్రీవల్లి వినీత యాక్ట్ చేశారు. మరోవైపు ఈ పాటను అద్భుతమైన లోకేషన్లలో చిత్రికరించారు. అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయి పడే పాట్లు సరదాగా చూపించారు. ఈ సాంగ్ విడుదలైన రెండు రోజుల్లోనే 9 లక్షలకుపైగా వ్యూస్ రాగా, 43 వేల మందికిపైగా లైక్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్లో ఉన్న ఈ పాటను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.