చండీగఢ్ టూర్‌లో ఉన్న తెలంగాణ ప్రతినిధులు, ఆ నగరం వారసత్వం, రోడ్లు, ఉద్యానవనాలు సహా పలు ప్రాంతాలను చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్లు, ఛైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లతో పాటు మంత్రి మల్లారెడ్డి కూడా వెళ్లారు. మంత్రి నేతృత్వంలో 40 మంది సభ్యుల బృందం గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించింది. ఎక్స్‌పోజర్ విజిట్ అని పిలిచే ఒక రోజు అధ్యయన పర్యటనలో భాగంగా చండీగఢ్ చేరుకుని ప్రముఖ ముఖ్యమైన 10 ప్రదేశాలను చూసి ఆస్వాదించారు.