వైఎస్ వివేకానంద రెడ్డి మిస్టరీ హత్య కేసు విషయంలో ఏపీ సీఎం జగన్ వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్యతో జగన్ రాజకీయంగా లబ్ది పొందరాన్నారు. ఈ కేసు గురించి బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ కు న్యాయవ్యవస్థపై గౌరవం లేదని అభిప్రాయపడ్డారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల అడ్డా అని.. ఇప్పటివరకు సీబీఐ సేకరించిన విషయాలన్నీ గమనిస్తే ఈ హత్య వెనుక జగన్ హస్తం ఉన్నట్లు అనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసిన తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది.