తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు చేత ప్రారంభించిబడిన తెలుగుదేశం పార్టీకీ మార్చి 29 నాటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ పార్టీ ఆవిర్భవించడం రాజకీయ అనివార్యమని.. కూడు, గూడు, గుడ్డ నినాదంతో పార్టీ పుట్టిందని అన్నారు. ఈ మేరకు పార్టీ గొప్పదనాన్ని తెలిసేవిధంగా ఈ 40 వసంతాల వేడుకలను నిర్వహించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజల కోసమే కానీ, పదవుల కోసం ఈ పార్టీ ఏర్పడలేదని చంద్రబాబు పేర్కొన్నారు.