హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా వెయ్యికి పైగా సినిమాలతో తెలుగులో ఓ వెలుగు వెలిగిన నటుడు చంద్రమోహన్. అయితే తాను చిన్న చిన్న తప్పులతో ₹100 కోట్ల దాకా పోగొట్టుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కొంపల్లి దగ్గర 35 ఎకరాల ద్రాక్ష తోట కొని మేనేజ్ చేయలేక అమ్మేశా. శోభన్ బాబు చెప్పినా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మేశాను దాని విలువ ఇప్పుడు ₹30 కోట్లు. శంషాబాద్ మెయిన్ రోడ్డుకు 6 ఎకరాలు అమ్మేశా ఇలా దాదాపు ₹100 కోట్లు పోగొట్టుకున్నా. జయసుధది కూడా నాలాంటి పరిస్థితే’ అని చెప్పుకొచ్చారు.