TDP అధినేత చంద్రబాబు నాయుడు పోలీసుల తీరుపై మండిపడ్డారు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి అక్రమ కేసులు పెట్టడమెంటని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నేరస్తులను కాపాడుతున్నారా, ఎవరి అండ చూసుకుని రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటూ నిలదీశారు. పోలీసులు YSRCP కార్యకర్తల్లా మారారని, తప్పులు చేస్తున్న వారని వదలేది లేదని హెచ్చరించారు. రేపు మేము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ హత్య ప్రభుత్వం చేయించినదేనని ఆరోపించారు.