తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను కేసులతో బెదిరించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. మహానాడు ద్వారా క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు పిలుపునిద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో చిచ్చు పెట్టి అగ్గి రాజేశారని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన 28 పథకాలను రద్దు చేసిందని ఆయన తెలిపారు.