ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే భయంతో సీఎం జగన్ త్వరలో ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇళ్లు ఇస్తే జగన్ ఆ ఇళ్లపై పన్ను వసూలు చేస్తున్నాడని మండిపడ్డారు. చెత్తకు కూడా పన్ను వేసే ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అంటారని చెప్పాడు. ఇక జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆయన అబద్దాలపై ఒక పుస్తకం విడుదల చేస్తామని వెల్లడించాడు. నాసిరకం మద్యం విక్రయిస్తూ మహిళల మంగళసూత్రాలు తెంచుతున్న జగన్కు మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని అన్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ముందు తన సోదరి సునీతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తి ఇంకా రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడని ద్వజమెత్తాడు. నిన్న మంగళగిరిలో తేదేపా పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వంపై ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం