ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని నాశనం చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి మూడు రాజధానుల నినాదంతో మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాలు విసిరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబునాయుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.