దక్షిణ మధ్య రైల్వే స్త్రీలకు గౌరవం ఇస్తూ.. మగవారితో సమాన ప్రాధాన్యమిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లాలోని చంద్రగరి రైల్వేస్టేషన్ లో ప్రత్యేకంగా లేడీస్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది. ఇందుకు అనుగుణంగా ఈ స్టేషన్లో ఉద్యోగులందరూ మహిళలే ఉండే విధంగా తీర్చిదిద్దారు. నాలుగేళ్లుగా సూపరింటండెంట్ నుంచి కీ ఉమెన్ వరకు అన్ని విభాగాల్లో మహిళలనే ఉద్యోగులుగా నియమించారు. దీంతో ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలోనే తొలి మహిళా రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.