బ్యాంకు ఖాతాకు సంబంధించిన మెుబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పటివరకు బ్యాంకుకి వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి అవసరం లేకుండా ఎస్బీఐ నేరుగా ఆన్‌లైన్‌లో మార్చుకునే వెసులుబాటును తీసుకువచ్చింది. www.onlinesbi.com ఓపెన్ చేసి మై అకౌంట్ విభాగంలో ప్రొఫైల్‌లోని పర్సనల్ డీటేయిల్స్‌లోకి వెళ్లి చేంజ్ మై మెుబైల్ నంబర్‌పై క్లిక్ చేయండి. అకౌంట్ నంబర్‌ను ఎంచుకున్న తర్వాత మెుబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మ్యాపింగ్ స్టేటస్ తెలియజేయడానికి మీ రిజిస్టర్డ్ మెుబైల్ నంబర్ ఉపయోగపడుతుంది.