పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకనుంచి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తీసుకువస్తామని విద్యాశాఖ కార్యదర్శి శ్రీ దేవసేన తెలిపారు. 9,10 తరగతుల సమ్మెటివ్ అసెస్మెంట్-2 ను కూడా ఆరు పేపర్లతోనే నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు 11 పేపర్లతో పరీక్ష నిర్వహించారు. విద్యార్థులకు భారం పడుతోందనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
పదో తరగతి పరీక్షలో మార్పులు

© ANI Photo