ఏపీలో సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వం మార్పు చేసింది. ఈ నెల 12 నుంచి 18 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఈనెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. అయితే విద్యాశాఖకు వచ్చిన వినతుల మేరకు తాజాగా సెలవులు మారుస్తూ ప్రకటన విడుదల చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 19న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.