యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు?

© ANI Photo

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే దిశగా ఆర్బీఐ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతూ ఓ చర్చ పత్రాన్ని విడుదల చేసింది. అక్టోబర్ 3 నాటికి దీనిపై అభిప్రాయాలు చెప్పాలని సూచించింది. యూపీఐపై ఛార్జీలను లావాదేవీలపై శాతంగా విధించాలా? లేక స్థిరమైన ఛార్జీలు ఉండాలా? లేదా పేమెంట్ సంస్థలకు వదిలేయాలా? అనే అంశాలపై అభిప్రాయాలు కోరింది. ఈ సూచనలను యూపీఐపై విధివిధానాల రూపకల్పనకు ఉపయోగిస్తామని వెల్లడించింది.

Exit mobile version