కెనరా బ్యాంకు ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవి ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. చెక్ రిటర్న్, మినిమమ్ బ్యాలెన్స్, ఫండ్ ట్రాన్స్పర్ వంటివి పెరగనున్నాయి. చెక్ రిటర్న్ అయితే రూ. 1000లోపు ఉంటే రూ. 200 చెల్లించాలి. వెయ్యి నుంచి రూ. 10 లక్శలలోపు 300లు ఇవ్వాలి. నెలవారీ బ్యాలెన్స్ అయితే..సేవింగ్స్ అకౌంట్ గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500,పాక్షిక పట్టణాల్లో రూ. 1000, మెట్రో సహా ఇతర పట్టణాలకు రూ. 2000లు మెయింటేన్ చేయాలి లేదంటే రుసుం కట్టాలి.