హైదరాబాద్‌లో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. అయినా కొంతమంది ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇకపై అలాంటి వారికి చెక్ పెడతామని పోలీసులు చెబుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే వంతెన ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల చివరినాటికి పనులు పూర్తవుతాయని.. ఆ తర్వాత ఎక్స్‌ప్రైస్ వే పైకి ఎక్కే బైక్‌లను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.