దేశంలో మళ్ళీ అడుగుపెట్టనున్న చీతాలు

© Envato

భారత దేశంలో 74ఏళ్ల క్రితం అంతరించిపోయిన చీతాలు మళ్ళీ దేశంలోకి అడుగుపెట్టనున్నాయి. నమీబియా నుంచి 8 చీతాలను కేంద్ర ప్రభుత్వం దేశానికి తీసుకురానుంది. వీటిలో 5 ఆడ చీతాలు ఉండగా.. 3 మగ చీతాలు ఉండనున్నాయి. ప్రత్యేకమైన బోయింగ్ బీ747 విమానంలో వీటిని జైపూర్‌కు తరలిస్తారు. అనంతరం ఓ హెలికాఫ్టర్ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలిస్తారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ వీటిని పార్కులో విడిచి పెడతారు. కాగా 1948లోనే మధ్యప్రదేశ్‌‌లో చివరి చీతా మరణించడంతో.. 1952లో దీనిని అంతరించిపోయిన వన్యప్రాణిగా ప్రభుత్వం గుర్తించింది.

Exit mobile version