IPL 2022 సీజన్‌లో 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. ముందుగా ఢిల్లీ టాస్ గెల్చి బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఆటకు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. తర్వాత 209 పరుగుల చేధనకు వచ్చిన ఢిల్లీ ఆటగాళ్లు 117 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో CSK 91 రన్స్ తేడాతో గెలిచింది. మొయిన్ అలీ 3, బ్రావో 2, సిమర్జిత్ 2, ముఖేష్ 2 వికెట్లు తీసి అదరగొట్టారు.