టాటా ఐపీఎల్-2022 మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సీజన్లో 10 జట్లు పాల్గొననుండగా.. అన్ని జట్లు వారి వారి జెర్సీలను విడుదల చేశాయి. తాజాగా ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీంగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తమ జెర్సీని విడుదల చేసింది. దానికి ఎల్లోలవ్ అని హ్యాష్‌ట్యాగ్ జత చేసింది.