ఇరాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ సారా ఖాదీమ్‌కు కొందరు ఆకతాయిలు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె కజకిస్తాన్‌లో ప్రపంచ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్లో ఆడుతుంది. చెస్ టేబుల్‌పై తలకు హిజాబ్ ధరించకుండా ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. దీంతో ఆట ముగించుకు రావాలని… ఇరాన్ వస్తే చంపేస్తామంటూ కొందరు సారాతో పాటు ఆమె కుటుంబసభ్యులకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.