హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) తయారు చేసిన చేతక్ హెలికాప్టర్ భారతదేశంలో విజయవంతంగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ హెలికాప్టర్ భారత వైమానిక దళంలో అత్యంత పురాతనమైనదిగా ఘనతను సాధించింది. వైమానిక దళంలోనే కాకుండా మూడు సర్వీసుల్లో సేవలు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ కన్వెన్షన్ సెంటర్లో కాన్క్లేవ్ నిర్వహించారు. ఈ క్రమంలో సిబ్బంది 60 అక్షరాల రూపంలో నిల్చుని ప్రదర్శన చేశారు. చేతక్ హెలికాప్టర్ 1962లో వైమానిక దళంలోకి ప్రవేశించింది. నేటితో ఇది 60 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసింది.