పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ బడుల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో చికెన్, పండ్లు చేర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.371 కోట్లను మంజూరు చేసింది. 16 వారాల పాటు ఈ స్కీమ్ కొనసాగనుంది. అయితే ఇది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందో లేదో మాత్రం ప్రభుత్వ నోటిఫికేషన్లో చెప్పలేదు. PM పోషణ్లో అందిస్తున్న ఆహారానికి అదనంగా ఇది ఇవ్వనున్నారు. ప్రస్తుతం పప్పులు, కూరగాయలు, గుడ్లు అందిస్తున్నారు.