భారాస ఆవిర్భావ సభ కోసం విచ్చేసిన జాతీయ నేతలు యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి దిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో పాటు అఖిలేష్ యాదాద్రికి వెళ్లారు. అర్చకులు వారికి మహాపూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన నేతలు…స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రముఖులు వస్తుండటంతో భక్తుల దర్శనాలు బ్రేక్ అయ్యాయి. పర్యటన అనంతరం నేతలు ఖమ్మం బయలుదేరతారు.