క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ వాట్సాప్ చాట్ ను ఈడీ రికవరీ చేసింది. అందులో ఉన్న ప్రముఖుల జాబితాను సేకరించింది. సోమవారం నుంచి వీరిని ప్రశ్నించే అవకాశముంది. అనేక మంది రాజకీయ, వ్యాపార ప్రముఖులతో చీకోటికి సంబంధం ఉన్నట్లు ఈడీ తేల్చింది. ప్రముఖ వ్యాపారి సంపత్, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, తీగల కృష్ణారెడ్డి తదితరులతో చీకోటికి సంబంధాలు ఉన్నట్లు ఈడీ ప్రాథమికంగా నిర్ధరించింది.